రూటింగ్ గురించి మీరు తెలుసుకోవలిసిన విషయాలు

రూటింగ్ గురించి మీరు తెలుసుకోవలిసిన విషయాలు
HIGHLIGHTS

రూటింగ్ అనేది ఆండ్రాయిడ్ ఫోన్ లోని అదనపు ఫీచర్స్ ను పొందటానికి.

ఈ ఆర్టికల్ ఎవరికి?
స్మార్ట్ ఫోన్ ను స్మార్ట్ గా, ఎక్కువుగా వాడుకునే, వాడాలనుకునే వారికి మరియు టెక్నాలజీ విషయాలను నేర్చుకునే కుతూహలం ఉన్న వాళ్లకి ఈ ఆర్టికల్. ఎవరేజ్ స్మార్ట్ ఫోన్ యూజర్ కి కాదు. మొత్తం అంతా చదివి టైమ్ వెస్ట్ చేసుకొని, అర్థం కాలేదు అనుకోకండి.

రూటింగ్ (Rooting) అంటే ఏంటి?
రూటింగ్ అనేది ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించిన పదం. ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లోని కొన్ని అదనపు ఫీచర్స్ ను ఇవ్వటానికి అవకాశం కలిపిస్తుంది.

రూటింగ్ వలన నష్టం?
1. వారెంటీ పోతుంది. అవును మీరు విన్నది కరెక్టే, మీ ఫోన్ కు రూటింగ్ చేశాక, దానికి ఏమైనా రిపెర్స్ వస్తే, వారెంటీ ఉన్నా, మీర ఫోన్ సాఫ్ట్ వేర్ ను రూటింగ్ అనే ప్రక్రియ తో మార్చారు అంటూ కంపెనీ వారెంటీ చెల్లదు అంటుంది. అయితే వాస్తవం ఏంటంటే అన్ రూటింగ్ (రూటింగ్ ఎంత సింపుల్ పనో, అన్ రూటింగ్ కూడా అంతే సింపుల్) చేస్తే మీ వారెంటీ తిరిగి పొందగలరు. అయితే వారెంటీ తిరిగి పొందటానికి కేవలం అన్ రూటింగ్ చేస్తే చాలా, లేక ఇంకా వేరే పని ఏదైనా చేయాలా అనేది మీ ఫోన్ బ్రాండ్ బట్టి ఉంటుంది. సోనీ ఆండ్రాయిడ్ ఫోన్లకు Bootloader కూడా లాకింగ్ చేయాలి.
2. ఇది పవర్ ఫుల్ డెవలపర్ ఆప్షన్స్ ను ఏక్సిస్ చేయటానికి అనుమతి ఇస్తుంది. సో, మీకు అవగాహన లేని ఆప్షన్ ను మీరు access చేస్తే, తరువాత మీకు ఏమి జరిగిందో తెలుసుకోవటానికి కొంచెం తెలియని తనం తో ఇబ్బంది, భయం ఏర్పడతాయి తప్ప, ఫోన్ పూర్తిగా ఎందుకు పనికిరాని పరిస్థుతులకు రాదు.

అసలు రూటింగ్ చేస్తే వచ్చే ఫీచర్స్ ఏంటి?
క్రింద చెప్పే ఈ ఫీచర్స్ రూటింగ్ లేని ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేయవు.

1. మీరు కొత్తగా కొన్న ఫోన్ తో పాటు కొన్ని అనవసరమైన అప్లికేషన్లు ముందే ఇంస్టాల్ చేయబడి వస్తాయి. వాటిని మామూలుగా అయితే అన్ ఇంస్టాల్ (డిలీట్) చేయటం కుదరదు. రూటింగ్ చేశాక, గూగల్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో Link2SD లాంటి ఆప్స్ ను డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకొని పెద్ద సైజు అప్లికేషన్స్ ను మైక్రో ఎస్డి మెమరీ కార్డ్ లోకి మూవ్ చేయగలరు.. మీకు ఉన్న తక్కువ ఇంటర్నెల్ స్టోరేజ్ సమస్యకు ఇది కరెక్ట్ సల్యుషణ్. ఆప్స్ ను మైక్రో ఎస్డి కార్డ్ లోకి మూవ్ చేస్తే, మీకు స్టోరేజ్ లేకపోవటం అనే సమస్య తీరుతుంది. అలాగే మీకు నచ్చని సిస్టం అప్లికేషన్ లేదా యూజర్ అప్లికేషన్ దేనినైనా అన్ ఇంస్టాల్ (డిలిట్) చేసుకోవచ్చు. మొబైల్ కంపెనీలు వాటి సొంత ఆప్స్ ను ప్రోమోట్ చేయటానికి డిఫాల్ట్ గా కొన్ని ఆప్స్ ను ఇంస్టాల్ చేసి ఇస్తాయి. వాటిలో కొన్ని మీకు డైలీ యూసేజ్ లో ఎందుకు పనికిరావు. అయితే వారేంటి పోగొట్టుకొని మరీ ఈ ఫీచర్ కోసం రూటింగ్ చేయాలా అని అడిగితే…
మీకు ఆ సిస్టం ఆప్స్ పనికిరాకపోవడం అనేది అసలు కారణం కాదు, ఈ సిస్టం ఆప్స్ నిరంతరం బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యి, ఫోన్ స్పీడ్ ను, బ్యాటరీ బ్యాక్ అప్ ను తగ్గించేస్తాయి. అయితే మాత్రం వారెంటీని ఎవరు పోగొట్టుకోవటానికి సాహసిస్తారు అని అంటే, మీరు చేయక పోవచ్చు, స్మార్ట్ ఫోన్స్ ని నిజంగా ఎలా వాడాలో తెలిసిన వాళ్లు రూటింగ్ చేసుకుంటారు. వాళ్ళకుండే ధీమా ఏంటంటే, ఫోన్ ఎలాగో బ్రాండ్ అయితే దానికి రిపేర్ రావటం తక్కువ చాన్సేస్, రెండవది రఫ్ అండ్ టఫ్ గా కాకుండా స్మూత్ గా వాడుకునె వారికి, రిపేర్ రాదు అనే ధైర్యం ఉంటుంది, మూడవది ఏదైనా డెవలపర్ ఆప్షన్ ను access చేసే ముందు దాని టుటోరియల్ (స్టెప్ బై స్టెప్ ప్రోసెస్) చూసి చేస్తారు. అసలు మీరు ఎన్ని ఫోనులు వాడారు, వాటి రిపేర్ల కోసం సర్వీస్ సెంటర్లకు ఎన్ని సార్లు వెళ్లారు? రిపేర్ రావటం అనేది బ్రాండెడ్ ఫోనుల్లో అరుదు.

2. రెండవ ఫీచర్, No-frills CPU అనే ఆప్ సహాయంతో, మీ ఫోన్ ప్రోసెసర్ స్పీడ్ ను డిఫాల్ట్ సెట్టింగ్ నుండి మ్యాక్సిమమ్ స్పీడ్ కు మార్చుకోవచ్చు. అంతే కాదు మీరు పెద్ద గేమ్ లేదా పెద్ద అప్లికేషన్ ను వాడుతున్నప్పుడు అది బాగా రన్ అవటానికి, లేదా మీరు బయట హడావిడిగా మ్యాప్స్ ను వాడే పరిస్తితులలో ఉన్నప్పుడు, మీ ప్రోసెసర్ స్పీడ్ ను ఫుల్ గా పెంచుకొని స్లో అవటం నుండి బయట పడవచ్చు, అలాగే మీరు ఫోన్ ను వాడనప్పుడు (స్క్రీన్ ఆఫ్) అయి పాకెట్ లో ఉన్నప్పుడు ప్రాసెసర్ స్పీడ్ ను తక్కువుగా పెట్టుకోవటం(ఇది ఆటోమేటిక్ సెట్టింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు) వలన కావలిసినప్పుడు బ్యాటరీ, స్పీడ్ రెండింటినీ మీరు కంట్రోల్ చేయగలరు.

3. మీరు ఏదైనా అప్లికేషన్ వాడనప్పుడు అది బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవకుండా (జెనరెల్ గా మీరు ఆప్స్ ను ఫోర్ గ్రౌండ్ లో వాడనప్పటికీ, అవి బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ బ్యాటరీ, స్పీడ్ రెండింటినీ వాడుకుంటాయి), కాని మీరు ఆ అప్లికేషన్ ను ఓపెన్ చేసినప్పుడు  మాత్రం రన్ అయ్యేలా Greenify అనే అప్లికేషన్ లో సెట్ చేసుకోవచ్చు.

4. ఇది చాలా మంచిది, ఫోన్ లో (మీరు గేమ్ ఆడుతున్నప్పుడు లేదా వీడియో చూస్తున్నప్పుడు) ఎక్కడా ఏడ్స్ రాకుండా ఉండటానికి AdBlock వంటి ఆప్స్ వాడవచ్చు.

5. మీరు కనుక ప్రతీ చిన్న విషయాన్ని మీకు నచ్చినట్టుగా చేసుకునే వారు అయితే, రూటింగ్ చేశాక మీ ఫోనులో అలాంటివి చేయటానికి చాలా(లాక్ స్క్రీన్ లుక్, నోటిఫికేషన్ బార్ షార్ట్ కట్ ఫీచర్స్, మీ నోటిఫికేషన్ led ఇండికేటర్ కలర్ మార్చుకోవటం లాంటివి)  ఉంటాయి. దీనికి Pimp My Rom, Xposed tools అప్లికేషన్స్ బాగా ఉపయోగపడతాయి.

6. ఇవన్ని చేసేసాక, మీ ఫోన్ లో కంపెని ఇచ్చిన os ను కాక కాస్టమ్ ఆపరేటింగ్ సిస్టం/సాఫ్ట్వేర్ (దీనిని ఆండ్రాయిడ్ భాషలో ROM అని అంటారు) ను ఇంస్టాల్ చేసుకొని, సరికొత్త ఫీచర్స్ ను ఏక్సిస్ చేయవచ్చు. అయితే వాస్తవానికి Xposed Framework అనే అప్లికేషన్ ను డెవలప్ చేసిన తరువాత మీరు కొత్త కస్టమ్ ఆపరేటింగ్ సిస్టం(ROM) ను కేవలం ఫీచర్స్ కోసం ఇంస్టాల్ చేసుకునే అవసరం లేదు. అన్ని రకాల కస్టమ్ ROM లు ఇచ్చే ఫీచర్స్ అన్నీ Xposed modules రూపంలో Xposed framework అప్లికేషన్ లో లభిస్తాయి.

7. మీ ఫోన్ స్పీడ్ తగ్గిపోయిందని, వైరెస్ ఎక్కిందని, సెట్టింగ్ ఆప్షన్స్ లో ఎదో తెలియకుండా మార్చారు అని, లేదా కొన్నప్పుడు ఎలా ఉందో అలా కావాలని చాలా మంది ఫోన్ ను రీసెట్ చేస్తారు. ఇలా చేస్తే ఫోన్ కాంటాక్ట్స్, ఆప్స్, మెసేజెస్ అన్నీ పోతాయి.  కాంటాక్ట్స్ ఎలాగో మీ జి మెయిల్ ఐడి తో అనుసంధానం అయ్యి తిరిగి మీరు ఆ మెయిల్ ఐడి ని రీసెట్ చేశాక ఎంటర్ చేస్తే వచ్చేస్తాయి. కాని అప్లికేషన్స్, ఫోన్ సెట్టింగ్స్, కాల్ లాగ్స్, మెసేజెస్ కూడా పొందాటానికి Titanium BackUp లాంటి రూట్ అప్లికేషన్స్ సహాయంతో మీరు ఆడిన గేమ్ ఎక్కడివరుకు ఆడరో, మళ్ళీ అక్కడ నుండే ఫోన్ రీసెట్ చేసినా తిరిగి ఆడుకునెంత శక్తివంతమైన బ్యాక్ అప్ ఫీచర్ ఉంటుంది. అంటే ఆప్స్ అన్నీ బ్యాక్ అప్ తీసుకోవచ్చు. 

8. చివరిగా కేవలం చిన్న చిన్న మార్పులు, లుక్స్ కోసమే కాకుండా మీకు రియల్ లైఫ్ లో ఫోన్ యూసేజ్ ను తక్కువ బటన్స్ ప్రెస్సింగ్ మరియు కేవలం ఒకటి రెండు టచెస్ లో పనులు సింపుల్ గా జరిగిపోయేలా చాలా రకాల ఆప్షన్స్, ఉపయోగాలు ఉన్నాయి రూటింగ్ వలన. అలాగే పూర్తిగా కొత్త కొత్త అవసరాలు తీర్చే రూటింగ్ ఆప్స్ కూడా ఉన్నాయి.

రూటింగ్ ఎలా చేయాలి?
ముందుగా రూటింగ్ చేయటానికి కావలిసినవి:

మీ ఫోన్ డేటా కేబుల్ (ఇతర డేటా కేబుల్ అయినా ఫర్వాలేదు, 95 % అన్ని కేబుల్స్ ఒకటే).
OneClickRoot విండోస్ సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసేందుకు ఇంటర్నెట్. 3.5 MB ఉంటుంది సైజ్.
విండోస్ కంప్యూటర్ (విండోస్ ఏ వెర్షన్ ఉన్నా ఫర్వాలేదు).
కొంచం ఓపిక, ఏకాగ్రత 🙂

ముందుగా కొన్ని Low End మరియు చైనా హాండ్ సెట్స్ పై రూటింగ్ అనుకోని విధంగా ఫోన్ ను పనిచేయకుండా చేసే అవకాశాలు ఉన్నాయి. సో, మీ ఫోన్ మోడల్ పేరుతో గూగల్ లో రూటింగ్ గురించి సెర్చ్ చేసి అవుతుందో లేదో తెలుసుకొని రూటింగ్ చేయండి.
మీ ఫోన్ పాడు అవటానికి మేము బాధ్యులము కాము. పూర్తిగా అన్నీ తెలుసుకొని ప్రయత్నించండి.

రూటింగ్ చేయటానికి మొదట్లో చాలా పెద్ద ప్రోసెస్ ఉండేది, ఇప్పుడు కేవలం కొన్ని క్లిక్స్ లో రూటింగ్ మరియు అన్ రూటింగ్ జరిగిపోతున్నాయి.
1. ముందు మీ ఫోన్ లో మెయిన్ Settings లో About Phone అనే లాస్ట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.
2. అక్కడ Build Number అనే ఆప్షన్ పై వరసుగా 8 సార్లు టచ్ చేయండి.
3. ఇప్పుడు మెయిన్ Settings లో Developer Options అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
4. ఈ కొత్త స్క్రీన్ లో Developer Options ను పైన ఆన్ చేసి, USB debugging అనే ఆప్షన్ ను కూడా ఎనేబల్ చేస్తే మీరు ఫోన్ లో చేయవలిసిన పని పూర్తి అయ్యినట్లే.
5. చివరిగా  మెయిన్ Settings లో Security పై క్లిక్ చేయండి, అందులో Unknown Sources ఆప్షన్ ను ఎనేబల్ చేయండి. ఇది మీకు ఇంటర్నెట్ లో విడిగా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫైల్(.apk) దొరికితే, దానిని మీ ఫోన్ లోకి కాపీ పేస్ట్ చేసుకొని మిరే ఇంస్టాల్ చేసుకోవచ్చు, ప్లే స్టోర్ కు వెళ్లకుండా.

6. ఇప్పుడు OneClickRoot .exe సాఫ్ట్వేర్ ఫైల్ ను ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
7. డౌన్లోడ్ అయ్యాక, దాన్ని ఇంస్టాల్ చేయండి మీ విండోస్ కంప్యూటర్ లో.
8. ఇంస్టాల్ అయిన యాప్ ను ఓపెన్ చేసి రన్ చేయండి, అది చెప్పే స్టెప్స్ ను పాటించండి (పైన మీరు చేసిన స్టెప్స్ నే అది చెబుతుంది).
9. అది చెప్పినవాటిలో చేయని పనులు ఏమైనా ఉంటే కచ్చితంగా చేయండి. అలాగే అది మీ కంప్యూటర్ స్క్రీన్ పై అక్కడ చూపిస్తున్న రూటింగ్ సమాచారం అంతా చదివండి.
10. ఇప్పుడు మీ ఫోన్ లో USB debugging ఎనేబల్ చేశాక, OneClickRoot ఇంస్టాల్ చేసిన కంప్యూటర్ కు డేటా కేబుల్ తో కనెక్ట్ చేయండి. కొన్ని ఫోన్ మరియు కంప్యుటర్ డ్రైవర్స్ ఇంస్టాల్ అయ్యేవరుకు వెయిట్ చేసి, OneClickRoot సాఫ్ట్ వేర్ లో ROOT NOW అనే బటన్ పై క్లిక్ చేయండి.
11. కొంత సేపు ఆగి మీ ఫోన్ స్క్రీన్ ను గమనించండి, అది ఏదైనా పర్మిషన్స్ అడిగితే okay ప్రెస్ చేయండి. 2 నుండి 5 నిముషాలు తరువాత రూటింగ్ సక్సెస్ అయ్యింది అని మెసేజ్ వస్తుంది కంప్యూటర్ లో.
12. అంతే, మీ ఫోన్ రూటింగ్ అయినట్లే. 

గమనిక: అయితే ఇది అన్నీ బ్రాండ్లకు పనిచేయక పోవచ్చు. సోనీ కు అయితే కేవలం రూటింగ్ ఒక్కటే కాదు, Bootloader కూడా Unlock చేయాలి. సో ముందు మీరు గూగల్ లో మీ ఫోన్ కు ఎటువంటి రూటింగ్ మెథడ్స్ ఉన్నాయి సెర్చ్ చేయండి. దాని బట్టి ప్రయత్నించండి.

రూటింగ్ చేశాక, ఏమి చేయాలి, ఏ అప్లికేషన్లు ఇంస్టాల్ చేసుకోవాలి?
మీ అవసరాలకు తగ్గట్టుగా  అప్లికేషన్స్ ను ఇంస్టాల్ చేసుకోండి. క్రింద టాప్ రూటింగ్ ఆప్స్ చూడగలరు.

Titanium Backup
ఉపయోగాలు:  ఇది మెసేజెస్, కాల్ లాగ్స్, కాంటాక్ట్స్, ఫోన్ సెట్టింగ్స్, వాల్ పేపర్, మరియు అప్లికేషన్స్/గేమ్స్ ను డేటా తో పాటు పూర్తిగా బ్యాక్ ఆప్ తీసి పెడుతుంది. ఇంతేకాదు ఆప్ ఫ్రీజింగ్, అన్ ఇంస్టాల్ మూవ్ టు మైక్రో ఎస్డి కార్డ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
దీని ప్రత్యేకత: స్టేబుల్ గా పనిచేస్తుంది. మరియు మీరు ఏదైనా గేమ్ ఎక్కువ స్కోర్ చేసి, లేదా ఒక ఆప్ లోని సెట్టింగ్స్ అన్నీ సెట్ చేసుకుని ఉంటే, మీరు ఆ గేమ్ డేటా మరియు ఆప్ సెట్టింగ్స్ డేటా ను కూడా అప్లికేషన్ తో పాటు బ్యాక్ అప్ తీసుకోవచ్చు.
ఎప్పుడు దీని అవసరం ఉంటుంది: మీ ఫోన్ స్పీడ్ తగ్గిపోయిందని, వైరెస్ ఎక్కిందని, సెట్టింగ్ ఆప్షన్స్ లో ఎదో తెలియకుండా మార్చారు అని, లేదా కొన్నప్పుడు ఎలా ఉందో అలా కావాలని చాలా మంది ఫోన్ ను రీసెట్ చేస్తారు. అలాంటప్పుడు రిసేట్ చేసుకునే ముందు మీ ఫోన్ లోని డేటా అంతా బ్యాక్ అప్ తీసుకోవచ్చు.
డౌన్లోడ్ లింక్: Titanium Backup

Adblock Plus
ఉపయోగం: ఫోన్ లో ఎక్కడా ఏడ్స్ లేకుండా చేస్తుంది.
ఎప్పుడు దీని అవసరం ఉంటుంది: మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా వీడియోస్ చూస్తున్నప్పుడు మధ్యలో డిస్టర్బింగ్ గా ఉంటుంది.
డౌన్లోడ్ లింక్: Adblock Plus 

Greenify
ఉపయోగాలు: మీరు ఏదైనా అప్లికేషన్ వాడనప్పుడు అది బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవకుండా (జెనరెల్ గా మీరు ఆప్స్ ను ఫర్ గ్రౌండ్ లో వాడనప్పటికీ, అవి బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ బ్యాటరీ, స్పీడ్ రెండింటినీ వాడుకుంటాయి), కాని మీరు ఆ అప్లికేషన్ ను ఓపెన్ చేసినప్పుడు  మాత్రం రన్ అయ్యేలా Greenify అనే అప్లికేషన్ లో సెట్ చేసుకోవచ్చు.
డౌన్లోడ్ లింక్: Greenify

Xposed Framework
ఉపయోగాలు: దీనితో చేయలేనిది అంటూ ఏమీ ఉండదు. మీ ఫోన్ లుక్స్ నుండి కొన్ని డెవలపర్ ఆప్షన్స్ మరియు సింపుల్ ఆప్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇది కేవలం ప్లాట్ఫారం, మీ అవసరాలు తీర్చేందుకు Modules ను డౌన్లోడ్ చేసుకోవాలి. అవి Xposed Framework లో ఉంటాయి. అయితే దీనిని అవగాహన లేకుండా వాడితే, ఫోన్ రిబూట్స్ ఇవ్వటం చేస్తుంది.
డౌన్లోడ్ లింక్: Xposed Framework (6.1 వెర్షన్ ఇంస్టాల్ చేసుకోండి. స్టేబుల్ గా ఉంది. బగ్స్ ఏమీ లేవు ఈ వెర్షన్ లో.)
 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo