షాపింగ్ అనేది ఇప్పుడు ఆన్లైన్ కు షిఫ్ట్ అయిపొయింది. కోట్లు ఖర్చుపెట్టి బయట కట్టే పెద్ద పెద్ద మాల్స్ ఇప్పుడు కేవలం సరదాగా తిరగటానికే అనేది అందరికీ తెలిసినదే. సో ఆన్ లైన్ షాపింగ్ అనే సరికి చాలా వెబ్ సైట్లు ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, myntra, స్నాప్ డీల్. ఇవి కాకుండా లేటెస్ట్ గా ఇండియన్ బిజినెస్ దిగ్గజాలు, టాటా మరియు అంబానీలు కూడా Tatacliq.com అండ్ Ajio అనే షాపింగ్ వెబ్ సైట్లు మొదలు పెట్టారు. అయితే ఇన్ని యాప్స్ ను మీరు ఫోన్లో ఇంస్టాల్ చేసుకోకునే అవసరం లేకుండా ప్రతీ షాపింగ్ సైట్ ఒక యాప్ లో పెట్టి ఇస్తుంది Online Shopping అనే ఆండ్రాయిడ్ యాప్. ఇదే అవసరానికి చాలా యాప్స్ ఉన్నాయి ఇలాంటివి. అయితే వాటి అన్నిటిలో ఇది ఎక్కువ రేటింగ్ తో వస్తుంది… 4.6 స్టార్ ఉంది. ఈ లింక్ పై క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేయగలరు ప్లే స్టోర్ నుండి. కేవలం షాపింగ్ సైట్లు మాత్రమే కాదు, రీచార్జ్, టికెట్స్ బుకింగ్, సెకెండ్ హ్యాండ్ సేల్స్, సర్వీసెస్, హోటల్స్.. ఇలా చాలా సైట్స్ ను ప్రత్యేకంగా సెపరేట్ గా యాప్ ఇంస్టాల్ చేయనవసరం లేకుండా ఇదే యాప్ లో వాడుకోగలరు.