వాట్స్ లో అప్ లో కొన్ని డైలీ చాటింగ్స్ లో ఉపయోగకరమైన ఫీచర్స్ ఉన్నాయి. ఎక్కువ శాతం మందికి వీటి గురించి తెలుసు. కాని చాలా తక్కువ మంది వీటిని అవసరాలకు వాడుతున్నారు. సో అవేంటో తెలియజేసే ప్రయత్నమే ఈ ఆర్టికల్. మీకు తెలిసినవి ఉంటే క్షమించగలరు. గమనిక క్రింద చెప్పే సెట్టింగ్స్ వాట్స్ అప్ అప్ డేట్స్ లో మారవచ్చు.
ఈమెయిలు చాట్ హిస్టరీ
వాట్స్ అప్ లో ఏదైనా చాట్ లేదా గ్రూప్ చాట్ ను సేవ్ చేయాలనుకుంటే లేదా ఇతరాలకు పంపాలనుకుంటే చాట్స్ ఓపెన్ చేసి 3 డాట్స్ సెట్టింగ్ పై క్లిక్ చేసి more లోకి వెళ్తే మీకు email chat అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక మెయిల్ చేయగలరు chats ను.
డెస్క్ టాప్ లో వాట్స్ అప్
మీ కంప్యుటర్ లో web.whatsapp.com అనే లింక్ ఓపెన్ చేస్తే మీకు బార్ కోడ్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఫోన్ లో వాట్స్ అప్ ఓపెన్ చేసి టాప్ రైట్ సైడ్ కార్నర్ లో ఉన్న WhatsApp Web ను టాప్ చేస్తే మీకు + సింబల్ తో మరొక స్క్రీన్ వస్తుంది ఫోన్ పై. దానిని టాప్ చేసి ఇప్పుడు మీరు మీ కంప్యూటర్ లో కనిపిస్తున్న బార్ కోడ్ ను స్కాన్ చేయాలి. లేట్ చస్తే CLICK TO RELOAD QR CODE అని మెసేజ్ వస్తుంది డెస్క్ టాప్ వాట్స్ అప్ లో. సో దానిపై మరలా క్లిక్ చేసి వెంటనే స్కాన్ చేయండి. జస్ట్ ఫోన్ లో ఉండే బాక్స్ లోపల డెస్క్ టాప్ కోడ్ ను ఉంచాలి. అంతే!
ఫోన్ లో ఆటోమాటిక్ గా ఫోటోస్/వీడియోస్ డౌన్లోడ్ అవకుండా
వాట్స్ అప్ సెట్టింగ్స్ లో Data Usage లో Media auto download క్రింద ఉన్న మూడు సెట్టింగ్స్ లో అన్నీ సెలెక్ట్ చేయకుండా ఉంచుకోవాలి.
మీరు రోజూ చాట్ చేసే వ్యక్తులకు లేదా ఇష్టం లేని వ్యక్తులకు డిఫరెంట్ నోటిఫికేషన్ సౌండ్ పెట్టుకోగలరు
మీరు పర్టికులర్ చాట్ ఓపెన్ చేసి టాప్ రైట్ లో ఉండే 3 dots లైన్ పై క్లిక్ చేసి view contact ను ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీకు custom notifications అని కనిపిస్తుంది. దానిపై టాప్ చేసి రెగ్యులర్ డిఫాల్ట్ వాట్స్ అప్ రింగ్ టోన్ కన్నా డిఫరెంట్ సౌండ్స్ ను సెట్ చేసుకోండి. అయితే ముందు పైన ఉన్న Use custom notifications ను enable చేయాలి.
groups లో ఉంటూ వాటి నోటిఫికేషన్స్ రాకుండా ఉండాలంటే
చాట్ పై లాంగ్ ప్రెస్ చేసి పైన కనిపించే సౌండ్ సింబల్ ను choose చేస్తే సౌండ్ on అండ్ ఆఫ్ అవుతుంది. ఇది individual చాట్స్ కు కూడా పనిచేస్తుంది. దీనినే Mute అని అంటారు.
గ్రూప్ ను mute చేసిన వారికి కూడా మీరు గ్రూప్ లో పెట్టె మెసేజ్ నోటిఫికేషన్ పంపగలరు
గ్రూప్ లో మీరు మెసేజ్ పంపేటప్పుడు చాట్ లో @ సింబల్ ఎంటర్ చేసి ఎవరికైతే మీరు మెసేజ్ నోటిఫికేషన్ వెళ్ళాలని అనుకుంటున్నారో వారి పేరును టైప్ చేయటం మొదలుపెడితే వాట్స్ అప్ ఆటో మాటిక్ గా పేరును సజెస్ట్ చేస్తుంది. ఇక దానిని సెలెక్ట్ చేసి మీరు మెసేజ్ సెండ్ చేస్తే అవతల వ్యక్తి గ్రూప్ ను mute చేసుకున్నా మీ మెసేజ్ నోటిఫై అవుతుంది.
ఎక్కువుగా చాట్ చేసే వ్యక్తి లేదా గ్రూప్ యొక్క చాట్ ను మీ ఫోన్ home స్క్రీన్ లో పెట్టుకోగలరు
చాట్ లేదా గ్రూప్ చాట్ పై లాంగ్ ప్రెస్ చేసి టాప్ రైట్ కార్నర్ లో ఉండే 3 డాట్స్ పై క్లిక్ చేస్తే మీకు Add chat shortcut అని ఉంటుంది. దానిపై టాప్ చేయగానే డైరెక్ట్ గా వాట్స్ అప్ ఓపెన్ చేయకుండానే చాట్ విండో ను ఓపెన్ చేసి మెసేజ్ పెట్టగలరు.