ఇండియన్ మార్కెట్ లో 256 GB హెవీ స్టోరేజ్ తో కొత్త బడ్జెట్ ఫోన్ Itel A70 ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ను అమేజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది మరియు ఈ ఫోన్ ను అంచనా ధరతో టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది. ఐటెల్ ఎ70 స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ అందించిన టీజర్ పేజ్ నుండి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లను కూడా అందించింది.
ఈ ఫోన్ ను జనవరి 3వ తేదీన ఇండియన్ మార్కెట్ లో విడుదల చేస్తునట్లు కంపెనీ తెలిపింది. ఐటెల్ ఎ 70 స్మార్ట్ ఫోన్ సన్నని మరియు వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగిన ఆకర్షణీయమైన డిజైన్ తో అందిస్తోంది. ఈ ఫోన్ కోసం అమేజాన్ ఇండియా ప్లాట్ ఫామ్ పైన అందించిన టీజర్ పేజ్ ద్వారా ఈ ఫోన్ లో 6.6 ఇంచ్ HD+ డిస్ప్లే 500 నిట్స్ పీక బ్రైట్నెస్ తో కలిగి ఉన్నట్లు తెలిపింది. ఈ ఫోన్ లో Type -C పోర్ట్ తో పెద్ద 5000 mAh బిగ్ బ్యాటరీని కూడా కలిగి వుంది.
Also Read : 200MP OIS కెమేరా మరియు 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తున్న Redmi Note 13 Pro+ 5G
అంటే, ఈ స్మార్ట్ ఫోన్ బిగ్ HD+ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీతో వస్తున్నట్లు క్లియర్ గా చెబుతోంది ఐటెల్. అంతేకాదు, ఐటెల్ ఎ70 స్మార్ట్ ఫోన్ లో మెమొరీ ఫ్యూజన్ ఫీచర్ తో 12GB వరకూ హెవీ ర్యామ్ ఫీచర్ మరియు 256GB వరకూ భారీ అంతర్గత స్టోరేజ్ ఉన్నట్లు కూడా కంపెనీ వెల్లడించింది.
ఇది మాత్రమే కాదు ప్రత్యేకమైన మెమెరీ కార్డ్ ద్వారా ఈ ఫోన్ స్టోరేజ్ ను 2TB వరకూ పెంచుకునే వేలు కూడా ఉన్నట్లు ఐటెల్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లాంచ్ చేస్తునట్లు కూడా కంపెనీ టీజర్ ద్వారా తెలిపింది.
ఐటెల్ ఎ70 స్మార్ట్ ఫోన్ అంచనా ధరను కంపెనీ ముందుగానే అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇంచింది. ఈ ఫోన్ ను Rs. XX99 ధరతో లాంచ్ చేయబోతున్నట్లు సూచించింది. ఈ ఫోన్ కోసం కంపెనీ అందిస్తున్న టీజర్ మరియు హైప్ ను చూస్తుంటే, ఈ ఫోన్ ను చాలా తక్కువ ధరలో ఇండియన్ మార్కెట్ లో పరిచయం చేసే వీలుందని అర్ధమవుతోంది.