Gold Price: మార్కెట్ లో ఈరోజు స్థిరంగా కొనసాగిన బంగారం ధర కొంత ఊరటని ఇచ్చింది. గత మూడు రోజులుగా బంగారం ధర క్రిందకు పడుతుండగా ఈరోజు ఈరోజు మాత్రం మార్కెట్ స్థిమిత పడింది. గత మూడు రోజుల్లో బంగారం ధర దాదాపుగా రూ. 1,100 రూపాయల వరకూ పడిపోయింది. అయితే, గత వారంలో మాత్రం దీని విరుద్దంగా బంగారం ధర రూ. 1,000 రూపాయలకు పైగా పెరుగుదలను చూసింది. ఈరోజు బంగారం ధర అప్డేట్, గోల్డ్ మార్కెట్ ఫ్యూచర్ మరియు నిపుణులు చెబుతున్న అంచనా లతో పాటు మరిన్ని వివరాలను గురించి ఈరోజు చర్చిద్దాం.
ఈరోజు గోల్డ్ రేట్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్ లో తులానికి కేవలం రూ. 100 మాత్రమే గోల్డ్ రేట్ పెరిగింది. దీన్ని మనం గోల్ రేట్ పెరిగింది అనటం కంటే స్థిరంగా ఉందని అనడమే సమంజసం కావచ్చు. అంటే, సింపుల్ గా నిన్న తులానికి ఉన్న రేట్ రూ. 61,530 రూపాయలకు జస్ట్ రూ. 100 యాడ్ అయ్యి రూ. 61,640 రూపాయల వద్ద స్థిరంగా వుంది.
ఈరోజు 24 Carat బంగారం ధర కూడా నిన్నటి రేవు వద్దనే కొసాగుతోంది. అంటే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 61,640 రూపాయల వద్ద క్లోజ్ అయ్యింది.
Also Read : iQOO 12 5G లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన కంపెనీ.. Amazing Specs ఈ ఫోన్ సొంతం.!
అలాగే, 24 Carat బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 Carat బంగారం ధర రూ. 56,500 రూపాయల వద్ద క్లోజింగ్ నమోదు చేసింది.
అంతర్జాతీయ మార్కెట్ లో మారుతున్నా డాలర్ రేట్ ను బట్టి బంగారం ధరలో మార్పులు జరుగుతున్నా, దేశంలో కొనసాగుతున్నపండుగ సీజన్ కూడా ఎంతో కొంత గోల్డ్ రేట్ పైన ప్రభావం చూపుతోంది. దీపావళీ పండుగ దగ్గరకు వచ్చింది కాబట్టి మరొకొన్ని రోజులు గోల్డ్ మార్కెట్ లాభాల్లోనే సాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అయితే, వాస్తవాలను పరిశీలిస్తే, నవంబర్ నెల గోల్డ్ మార్కెట్ నిజానికి నష్టాల బాటలో నడుస్తోంది. అంటే, బంగారం ధర రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. మరి చూడాలి రానున్న రోజుల్లో గోల్డ్ రేట్ పెరుగుతుందో లేక తగ్గుతుందో.