Gold Price Drop: ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర.!
ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర
గత నెల మొత్తం మీద అతిభారీగా పెరిగిన బంగారం ధర
ఈరోజు పసిడి ప్రియులకు కొంత ఊరట లభించింది
Gold Price Drop: ఒకరోజుల్లోనే భారీగా పడిపోయిన బంగారం ధర. నిన్న మార్కెట్ లో హైఎస్ట్ రేటును నమోదు చేసిన గోల్డ్ మార్కెట్ ఈరోజు దారుణంగా పడిపోయింది. వాస్తవానికి, గత నెల మొత్తం మీద అతిభారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు ఒక్కసారిగా పతనాన్ని చూసింది. గోల్డ్ రేట్ చుక్కల్లో చూస్తున్న తరుణంలో ఈరోజు పసిడి ప్రియులకు కొంత ఊరట లభించింది. ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్, ఎంత తగ్గింది మరియు కొత్త అప్డేట్ ఏమిటో ఒక్క లుక్కేద్దాం పదండి.
Gold Price Drop
ఈరోజు మార్కెట్ లో బంగారం ధర తులానికి ఏకంగా రూ. 1,090 రూపాయలు క్రిందకు దిగింది. నిన్న మార్కెట్ లో గోల్డ్ రేట్ రూ. 64,200 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చెయ్యగా, ఈరోజు మాత్రం రూ. 63,110 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది.
24 Carat గోల్డ్ రేట్
ఈరోజు ఉదయం రూ. 64,200 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,090 రూపాయలు క్రిందకు దిగి రూ. 63,110 రూపాయల వద్ద ఈరోజు క్లోజింగ్ ను సెట్ చేసింది. అయితే, నిన్న గోల్డ్ రేట్ హైఎస్ట్ రేటును చూసింది మరియు ఈరోజు 63 వేళా రూపాయల మార్క్ ను చేరుకుంది.
Also Read : Mini Vacuum Cleaner: చవక ధరలో చిన్న వాక్యూమ్ క్లీనర్ తెచ్చిన Ambrane
22 Carat గోల్డ్ రేట్
ఇక 22 Carat గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు రూ. 58,850 రూపాయల వద్ద ప్రారంభమైన 24 Carat ఆర్నమెంట్ గోల్డ్ రేట్ రూ. 1,000 రూప్యాలు క్రిందకు దిగి రూ. 57,850 రూపాయలు వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
డిసెంబర్ గోల్డ్ రేట్
ఈ నెల ప్రారంభం నుండి కొనసాగిన బంగారం ధర వివరాలను పరిశీలిస్తే, ఈ నెల డిసెంబర్ 1న బంగారం ధర రూ. 62,730
రూపాయల వద్ద మొదలయ్యింది. డిసెంబర్ 2న రూ. 220, డిసెంబర్ 3న రూ. 810 మరియు డిసెంబర్ 4న రూ. 440 రూపాయలు పెరిగిన బంగారం ధర 64 వేల రూపాయల మార్క్ ను చేరుకుంది.
అయితే, ఈరోజు గోల్డ్ మార్కెట్ నష్టాలను చూడటంతో మళ్ళీ తిరిగి 63 వేల రూపాయల మార్క్ ను చేరుకుంది. ఈ నెల గోల్డ్ రేట్ ఎటువైపుకు సాగుతుందో వేచి చూడాలి.
గమనిక : ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ లో బంగారం ధరలో మార్పులు ఉంటాయి.